బాన్సువాడ, మార్చ్ 4 ప్రజా గళం: బాన్సువాడ మండలకేంద్రంలోని కోటగల్లిలో శ్రీ కోట
దుర్గమ్మ దేవి ఆలయంలో గత మూడు రోజులపాటు ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరిరోజు మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, భక్తులతో కలసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.

