బాన్సువాడ, మార్చి 19, ప్రజా గళం.
మండలంలోని కొత్తబాది ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం పదో తరగతి విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు ఎంఈఓ నాగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణి చేశారు. కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాదించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకుడు పుట్ట భాస్కర్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు, గోపాల్ సింగ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

