ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:
విద్యా,వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించి ఉంటే సబ్బండ వర్గాల ప్రజల బడ్జెట్ గా ఉండేదని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అన్నారు. బుధవారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం విద్యా రంగానికి 15 శాతం వైద్య రంగానికి 20 శాతం నిధులు కేటాయించి ఉంటే బాగుండేది పేర్కొన్నారు. మధ్యతరగతి, పేదల కుటుంబంలో ఎంత పని చేసినా సుమారు 80 శాతం విద్యా, వైద్యానికే ఖర్చవుతున్నాయని ఎన్నికల్లో గెలుపు కోసం ఇస్తున్న వాగ్దానాలను ఉచితాలను పక్కనపెట్టి విద్యా, వైద్య రంగానికే పెద్దపీట వేసి ఉంటే మధ్య తరగతి,పేద ప్రజలు సంతోషించే వారనీ, తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపాన రూపాయి వెళితే కేవలం 40 పైసలే తిరిగి కేటాయించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపాల్సిన వాటా పంపాలని కేంద్రాన్ని కోరుతున్నమన్నారు.

