నిజామాబాద్ , మార్చి 20(ప్రజాగళం ప్రతినిధి)
తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా
డైరీ, నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు విధి నిర్వహణలో సమర్దవంతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తీసుకువెళ్లి అర్హులకు పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. టీజీవో సంబంధించిన చాలా సమస్యలు గత ప్రభుత్వంలో పెండింగ్ లోఉన్నాయి ఆర్థికపరమైన బిల్లులు
ఇప్పటి వరకే కొన్ని పరిష్కారం చేసాం మిగిలిన సమస్యలు కూడా విడతల వారీగా పరిష్కరిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,
నూడ చైర్మన్ కేశవేణు,
టీజీవో రాష్ట్ర కార్యవర్గం,జిల్లా కార్యవర్గం సభ్యులు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

