ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి :
టీజీఓ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. గురువారం
తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా
డైరీ, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అధ్యక్షులు అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్. లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,
నూడ చైర్మన్ కేశవేణు పాల్గొని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు విధి నిర్వహణలో సమర్దవంతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తీసుకువెళ్లి అర్హులకు పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. టీజీవో సంబంధించిన చాలా సమస్యలు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయని, ఆర్థికపరమైన బిల్లులు
ఇప్పటి వరకే కొన్ని పరిష్కారం చేసాం మిగిలిన సమస్యలు కూడా విడతల వారీగా పరిష్కరిస్తాం అన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులు పనిచేయడం వల్లనే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగులకు వెన్నంటి ఉంటానన్నారు. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో టి జీ ఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్ రావు,
ప్రధాన కార్యదర్శి
సత్య నారాయణ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సంతోష్, జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్,
రెవెన్యూ సంఘం అధ్యక్షులు రమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

