నిజామాబాద్ మార్చ్ 20 ( ప్రజా గళం ప్రతినిధి )
మండుతున్న ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీదినం మండుటెండలో ఎండ తీవ్రతను తట్టుకొని విధులు నిర్వహిస్తూనారన్నా ఉద్దేశ్వంతో వారి కంటికి చలువ దనమును ఇచ్చే కంటి అద్దాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు.కూలీంగ్ స్టోరేజీ వాటర్ బాటిల్స్ ను రవీంద్ర ఫార్మసి మెడికల్ ఏజన్సీ వారి సౌజన్యంతో పోలీస్ క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా సిబ్బందికి అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ అతినీలోహిత కిరణాల వలన జబ్బులు వచ్చి అనారోగ్యానికి గురి అవుతున్న సందర్భంగా కంటి అద్దాలను సిబ్బంది ప్రతీ ఒక్కరు తప్పక దరించి, చక్కగ సద్వీనియోగం పరుచుకోగలరన్నారు.వీటి వలన దుమ్ము, ధూళి కంటికి ఎలాంటి ప్రమాదం కలుగదని, సిబ్బంది ఎప్పటికప్పుడు మంచినీటి బాటిల్స్ ఉపయో గించుకోవాలని, సిబ్బంది ప్రతీఒక్కరు ప్రజలతో మర్యాదతో వ్యవహరించాలని, సిబ్బందికి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు..
ఈ కార్యాక్రమంలో ట్రాఫిక్ ఎ. సీ పీ నారాయణ , ట్రాఫిక్ సిఐ ప్రసాద్, రవీంద్ర ఫార్మసి అధ్యక్షులు మధు సుధన్, జనరల్ సెక్రటరీ సుధాకర్, ట్రేజరర్ సాయిలు, ట్రాఫిక్ ఎస్సై లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

