విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ.

మద్నూర్, మార్చి 20, ప్రజాగళం. ఎంఎస్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీకాంత్ ముప్పడివార్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేశారు. మద్నూర్ మండలంలోని పెద్ద ఎకర్ల, మేనూరు గ్రామాల్లోని పాఠశాలలో గురువారం ఎంఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేశారు. సందర్భంగా వారు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షల్లో ఒత్తిడికి గురికాకుండా, చదివిన పాఠ్యాంశాలను నెమరు వేసుకుంటూ పరీక్షలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగయ్య, ఉపాధ్యాయులు ఉమాకాంత్, గ్రామస్తులు మహేష్ సోమవార్, రాహుల్ గజ్జత్ వార్, సాయి కురుమ, ఉపాధ్యాయులు తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.