రెసిడెన్షియల్ పాఠశాల గదులకు 20 ఫాన్స్ అందజేత

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం దాస్ నగర్ లో గల మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల కు 20 సీలింగ్ ఫ్యాన్ లను అందజేయడం జరిగిందని 1104 యూనియన్ కంపెనీ ప్రెసిడెంట్ రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. తరగతి గదులలో ఫ్యాన్స్ సౌకర్యం లేకపోవడం వలన వేసవి వేడికి విద్యార్థులు తట్టుకోవడానికి సీలింగ్ ఫ్యాన్ లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి గంగాధర్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, జేఏసీ నాయకులు బాలేష్ కుమార్, సురేష్ కుమార్, గంగారాం నాయక్, నాంపల్లి, మల్లేష్, మన్మోహన్, చంద్రశేఖర్, రాజేందర్, వేణుగోపాల్, నవీన్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ స్వప్న మేడం విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థినిలు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. ఇంకా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.