నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
U.N.S.F.I స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభా పరీక్షలలో 3000 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 30 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయినారు, అందులో నుంచి స్థానిక వర్ని రోడ్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా గల సెయింట్ జేవియర్’స్ పాఠశాలకు చెందిన “సాత్విక” ఉత్తీర్ణురాలై డీఈవో అశోక్ గౌడ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నందుకు ప్రిన్సిపాల్ మేడం లతాగౌడ్ & చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ జేవియర్స్ పాఠశాల ” పాకాల నరసింహారావు ” అభినందించారు.
నిజామాబాద్ నుండి ఒకే విద్యార్థిని ప్రతిభా పురస్కారానికి సెలెక్ట్ కావడం అది కూడా మా పాఠశాల విద్యార్థిని కావడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

