బాన్సువాడ, ఎప్రిల్ 30, ప్రజా గళంః బాన్సువాడ పట్టణంలోని వాసవి హైస్కూల్ లో చదువు తున్న విద్యార్థిని సహస్ర మంగళవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో డివిజన్ టాపర్గా నిలిచింది. 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంది. వాసవి హైస్కూల్ ఉపాధ్యాయుల బోధన, విద్యార్థిని కృషి డివిజన్ టాపర్ గా నిలవడానికి కారణమైంది. విద్యార్థిని తండ్రి లైన్ మెన్. ఆయన ఆరోగ్యం బాగా లేకపోయిన సహస్ర కష్టపడి చదివి ఉత్తమ మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చింది. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు సహస్రను అభినందించారు.

