నిజామాబాద్ ,జూన్ 11( ప్రజాగళం)
ఏరువాక పౌర్ణమి సందర్భంగా రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని నాలుగవ డివిజన్లో ఉన్న రమ సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన వ్రత పూజలు ఒంటిగంట వరకు కొనసాగయి. అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈనెల ఏరువాక పౌర్ణమి కావడంతో భక్తులు తండోపతండాలుగా వచ్చి పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ

ప్రధాన కార్యదర్శి మైలారం నారాయణరెడ్డి మాట్లాడుతూ మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి పౌర్ణమి పూజలు కావడంతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, రానున్న రోజులలో ఆలయ అభివృద్ధికి భక్తులు సమర్పిస్తున్న ధన వస్తురూపంలో చందాలని స్వీకరిస్తున్నామన్నారు. 25 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ ఆలయం తమ పాలకవర్గ హాయంలో ఆలయ రజతోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తూ అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు బాల శ్రీనివాస స్వామి, కోశాధికారి నారాయణశెట్టి, పాలకవర్గ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

