రాం భూపాల్ ను ప్రధాన కార్యదర్శి గా నియమించడం సంతోషకరం. సేవాదళ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాం భూపాల్ కు సన్మానం.

 

ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాం భూపాల్ ను నియమించడం సంతోషకరం అని సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిన్నబ్బు రాంభూపాల్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శాలువా, బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సేవ ధల్ జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్ మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు ముద్దు బిడ్డకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమించడం గొప్ప విషయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఆయన చేసిన సేవలు గుర్తించి రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వడం అనేది పార్టీ కోసం పని చేసిన వారికి గౌరవం దక్కుతుందనడానికి ఉదాహరణగా చెప్పవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో

ఉపాధ్యక్షులు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి జైంట్ సెక్రటరీ శీలమంతుల రాజు దిలీప్ అప్సర్ కొత్తపేట్ మండల ప్రెసిడెంట్ మధు సతీష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.