కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుంది. కాంగ్రెస్ నాయకులు కళ్ళుండి చూడని కబోదిల వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే కాలేశ్వరం పై సిబిఐ విచారణ జరిపించాలి. ప్రపంచ దేశాలకు నరేంద్ర మోడీ ఆదర్శంగా నిలిచారు. బీజేపీ శాసనసభ ఉపపక్ష నేత పాయల్ శంకర్.

నిజామాబాద్ జూన్ 11( ప్రజా గళంప్రతినిధి)

దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన చూసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుందని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనపై నిజామాబాద్ లో బుధవారం నిర్వహించిన ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరo జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాయల్ శంకర్ మాట్లాడారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న నరేంద్ర మోడీకి ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. దేశ ప్రధాని కావాలని కలలుగంటున్న రాహుల్ గాంధీ దేశ ఆర్థిక పరిస్థితిని చేత భిన్నం చేసే విధంగా మాట్లాడడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళుండి చూడలేని కబోదిలా బిజెపిపై విమర్శలు కురిపిస్తున్నారని ఆయన అన్నారు. కానీ నరేంద్ర మోడీ పరిపాలన చూసి ప్రపంచ దేశాలు మన దేశానికి అండగా నిలుస్తున్నాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీ ఆర్ఎస్ రెండు ఒకటేనని అయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాలేశ్వరం ప్రాజెక్ట్ అక్రమలపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆయన కోరారు. అవినీతి పాలనపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొంద పెట్టారని, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీని త్వరలోనే ప్రజలు బొంద పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఆపరేషన్ సింధుర్ దేశ ప్రతిష్టను పెంపొందించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదేనని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్. రాజు, లక్ష్మీనారాయణ, వినోద్ కుమార్, ఆమా oద్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.