హత్య కేసులో రిటైర్డ్ ఎస్సై కొడుకు? తాగిన మైకంలో ఇరువురి మధ్య ఘర్షణ. పోలీసులకు ఫిర్యాదు చేస్తాడనే భయంతో హత్య చేసిన వైనం.

 

నిజామాబాద్ క్రైమ్ జూన్ 11( ప్రజా గళo )

నిజామాబాద్ నగర శివారులోని పాoగ్రా వాగు వద్ద సోమవారం రాత్రి జరిగిన హత్య కేసులో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవి విరమణ పొందిన ఓ ఎస్ఐ కుమారుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెళ్లడైనట్లు తెలిసింది.. పా oగ్రా శివారులో వ్యక్తి హత్యను సవాల్ గా స్వీకరించిన పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా హత్యకు దారి తీసిన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నగరంలోని ఆర్య నగర్ కు చెందిన వసంతరావు రిటైర్డ్ ఎస్సై కొడుకు ఇద్దరు కలిసి సోమవారం రాత్రి పాంగ్రా కల్లు బట్టిలో కల్లు సేవించినట్లు తెలిసింది. తాగిన మైకంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, వసంతరావు పై రిటైర్డ్ ఎస్సై కొడుకు దాడి చేశాడు. దాడితో అక్కడి నుండి వెళ్ళిపోతున్న వసంతరావు తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడనే భయంతో వసంతరావుని వెంబడించాడు. అక్కడే ఉన్న బండరాయితో తలపై, ముఖంపై మోది అక్కడి నుండి పారిపోయాడు. తీవ్ర గాయాలైన వసంతరావు అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు.

Leave A Reply

Your email address will not be published.