నిర్మాణానికి నోచుకోని డ్రైనేజీ ఆర్యనగర్ రోడ్ నెంబర్ 6లో రోడ్డుపై నిలిచిన మురికి నీరు వర్షాకాలం ప్రారంభానికి ముందే నడవడానికి ఇబ్బంది పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీ శుభ్రం చేయించాలని కాలనీవాసుల ఆవేదన

 

ప్రజాగళం/ నిజామాబాద్ ప్రతినిధి జూన్ 11:

వర్షాకాలం ప్రారంభం కాకముందే కొద్దిపాటి వర్షాలకి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ రోడ్ నెంబర్ 6 వెంకటేశ్వర స్వామి ఆలయం వెనకాల ప్రభుత్వం డ్రైనేజీ నిర్మించకపోవడంతో మట్టి కాలువ ద్వారా మురికి నీరు ప్రక్కన నిర్మించిన కాల్వకు బదిలాయించారు. ఆర్య నగర్ లోని పలు రోడ్లలో గల డ్రైనేజీ వాటర్ పూర్తిగా ఈ మట్టి కాలువ గుండా నే మురికి కాలువలోకి వెళ్లాలి. అట్టి కాలువలో చెత్తాచెదారం వేయడం వలన మురికి నీరు వెళ్లకుండా చెత్త అడ్డుపడడంతో కాలనీవాసులు నడిచే ప్రధాన రోడ్డు ముర్కి నీటితో

నిండిపోతుందని తాము నడవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది మాత్రం నామమాత్రంగా చుట్టుపక్కల ఉన్న సిమెంటు డ్రైనేజీలలో నుండి చెత్తను తొలగిస్తున్నారు తప్ప మట్టి కాలువ గుండా ఉండే చెత్తను గాని కాలువను గాని శుభ్రం చేయడం లేదని పలుమార్లు సిబ్బందిని ప్రశ్నించగా తమకేమీ సంబంధం లేదని పై అధికారులకు విన్నవించుకోండి మేమేం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇంటి ముందర జమ చేయబడ్డ చెత్తను మురికి కాలువలో పడేస్తున్నారు. అందువలన చెత్తంతా తట్టుకొని మురికి నీరు రోడ్డుపైకి చేరుతుందని చెత్త సేకరించే వాహనాలు సైతం వారంలో

ఒకసారి దర్శనమిస్తూ ఇంటికి 70 రూపాయలు ఇస్తేనే చెత్తను తీసుకెళ్తామని లేని పక్షంలో మేము తీసుకెళ్ళమని, ఏదైనా ఉంటే మునిసిపల్ కమిషనర్ ని సంప్రదించాలని ఆయన అనుమతితోనే ఇదంతా మేము చేస్తున్నామని చెత్త వాహనదారులు కూడా ఖరాకండిగా చెప్తున్నారని కాలనీవాసులు మండిపడుతున్నారు. ఆదిలోనే హంసపాదు లాగా ప్రారంభంలోనే తేలికపాటి వర్షానికి రోడ్లు మురికిమయమైతే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసినట్లయితే మురికి నీరు ఇళ్లల్లోకి ప్రవేశిస్తుందని నడవడానికి వేరే మార్గం లేదని, ఇకనైనా మునిసిపల్ అధికారులు కళ్ళు తెరిచి ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని లేనిపక్షంలో కలెక్టరేట్ ఆవరణలో ధర్నా చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.