భక్తిశ్రద్ధలతో హంపి పీఠాధిపతి జన్మదిన వేడుకలు.

బాన్సువాడ, జూన్ 12, ప్రజాగళం.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో గురువారం హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో శిష్యులు నిర్వహించారు. బాన్సువాడ అయ్యప్పలో స్వామీజీ జన్మదిన సందర్భంగాపడిపూజనిర్వహించారు. అనంతరం స్వామీజీ పాదుక పూజనుఆలయ మాజీ అధ్యక్షులు స్వామీజీ శిష్యులు మామిండ్ల రాజు నిర్వహించారు.
అనంతరం భజన అల్పాహార వితరణ గావించారు.
ధర్మ పరిరక్షణ కోసం హంపి పీఠం ఎంతో కృషి చేస్తుందని స్వామీజీ ప్రతినిత్యం ఆలయాల పరిరక్షణ ధర్మ రక్షణ కోసం పర్యటిస్తూ ప్రజలను చైతన్య o చేస్తున్నారని మామిండ్ల రాజు అన్నారు
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భజన బృందం తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.