రుచి అదుర్స్.. కాసుల బాలరాజు

బాన్సువాడ, జూన్ 12, ప్రజాగళం. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్థానిక నాయకులతో కలిసి నూతనంగా ప్రారంభించిన హోటల్ లో టిఫిన్ ఆరగించి రుచి అదుర్స్అని కితాబిచ్చారు. బాన్సువాడ స్టేడియం కాంప్లెక్స్లో గురువారం నూతనంగా ఏర్పాటుచేసిన రుచి పూరీ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. చికెన్ కర్రీ తో పూరి రుచికరంగా ఉందన్నారు. నాణ్యతతో టిఫిన్ తయారుచేసి, హోటల్కు వచ్చేవారి మన్ననలను పొందాలన్నారు. పూరికి ఉపయోగించే నూనె పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూరి సెంటర్ ప్రారంభించిన పంతులు రామును ఆయన అభినందించారు. రాజీ పడకుండా శుభ్రతతో కూడిన తిను బండారులుఅందించాలన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతు సమితి అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి, నాయకులు ఎజాజ్, నార్ల ఉదయ్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.