బాన్సువాడ పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా

 

బాన్సువాడ, జూన్ 21 ప్రజా గళంః

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని పలు పాఠశాలల్లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు . ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించడంతో పాటు పలు

రకాల యోగాసనాలు వారితో వేయించారు. ఈసందర్భంగా వాసవి హైస్కూల్ ప్రాంగణంలో ఉపాధ్యాయులు విద్యార్థులచే పలు రకాల యోగాసనాలు వేయించారు .జీవితంలో యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.