హామీలు నెరవేర్చకుంటే పోరాటాలను ఉదృతం చేస్తాం. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ అక్రమ అరెస్టులను ఖండించండి.

 

నిజామాబాద్ బ్యూరో సెప్టెంబర్ 20( ప్రజాగళం )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు.సిఐటియు జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిన్న జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి కార్యక్రమాలు లేకున్నా ఇండ్లలోకి,సెంటర్లకు వెళ్లి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

మహిళలని చూడకుండా ఇబ్బందులకు గురిచేస్తూ, బలవంతంగా ఒత్తిడి చేసి అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజా పాలన అవుతుందో…?? ప్రభుత్వం. పోలీస్ యంత్రాంగం ఆలోచించాలన్నారు.. అర్ధరాత్రి నుండి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి మండలాలలో పోలీస్స్టేషన్లో నిర్బంధించారని ఆమె అన్నారు.. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తాం

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఎన్నికల హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు కొద్దిరోజులుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్వాడిలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదన్నారు. మహిళా ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకున్న ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమన్నారు, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని నూర్జహాన్ డిమాండ్ చేశారు., ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు, విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలన్నారు, ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదని ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని ఆమె ఆక్షేపించారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక ,శారీరక ఎదుగుదల లో కీలకపాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని విమర్శించారు., ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కావలసింది విద్య ఒకటే కాదని విద్య కంటే పౌష్టికాహారం అత్యంత ముఖ్యమైందన్నారు, 50 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్ ఏర్పడిందన్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో శారీరక, మానసిక ఎదుగుదల అభివృద్ధి జరగకపోతే జీవితాంతం అంగవైకల్యంతో పిల్లలు బాధపడవలసి వస్తుందన్నారు, ప్రభుత్వాలు తీసుకుంటూన నిర్ణయంతో భావితరాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నయన్నారు, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు బోధించే బాధ్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 అమలు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులకు బకాయి జీతాలను ఇవ్వాలని మూడు నెలలు నాలుగు నెలలు గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వకుంటే ఎట్ల బతకాలి. కార్మికులతో వెట్టచాకిరి చేయించుకుంటూ సమస్యలో పరిష్కరించమంటే అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ ఆలోచించాలి. పోరాటాలను అరెస్టులతో అణిచివేయాలన్నా ఆలోచన మానుకోవాలన్నారు.

గత ప్రభుత్వంనికి ఏ గతి పట్టిందో అదే గతి కాంగ్రెస్ ప్రభుత్వంకు పట్టకుండా చూడాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు లేనియెడల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర గౌడ్ సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, జంగం గంగాధర్, నన్నేసాబ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.