ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు నిధుల జమ.

 

బాన్సువాడ, సెప్టెంబర్ 20, ప్రజాగళం.

బాన్సువాడ పట్టణంలోనీ 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు నిధులు జమ అయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు ప్రత్యేక కృషి ఫలితంగా గృహ నిర్మాణంలో సలాబ్ దశకు చేరుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం తరఫున ఇప్పటివరకు రూ. 3 లక్షలు, అందులో తాజాగా రూ. 2 లక్షలు జమ అయ్యాయి.ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం, పోచారం శ్రీనివాస్ రెడ్డి,కాసుల బాలరాజులకు కృతజ్ఞతలుతెలిపా రు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు మహమ్మద్ గౌస్, మున్సిపల్ సిబ్బంది, ఏఈ,వార్డు ఆఫీసర్ బాలరాజ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.