వరి పంట పరిశీలన – రైతులకు సూచనలు.

బాన్సువాడ, సెప్టెంబర్ 20, ప్రజాగళం.

మండలంలోనిబిర్కూర్,భైరాపూర్ గ్రామాల్లో వరి పంటపొలాలనుశుక్ర వారంఎడిఎఅరుణపరిశీలించారు.

ఈసందర్భంగాఆమెమాట్లాడుతూ,పంటలకు ఎండాకు తెగులు సోకినట్లు గుర్తిం చామనితెలిపారు.పిలకలు తొడిగే దశలో ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి,తరువాత ఇవి డాగు మచ్చలుగా మారి ఆకుల అంచుల వెంట మట్టల వరకు వ్యాపిస్తాయని వివరించారు. పసుపు-పచ్చ జిగురు లాంటి బ్యాక్టీరియా ఎండ వేడిమికి గట్టిపడి చిన్న చిన్న వుండలుగా కనిపిస్తాయని చెప్పారు.తెగులు నియంత్రణకు నత్రజని ఎరువుల వాడకాన్ని తాత్కాలి కంగా వాయిదా వేయాలని,పొలంలో ఉన్న నీటిని తొలగించాలని రైతులకు సూచించారు. ప్లాంటోమైసిన్ 0.2 గ్రా + కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని,అగ్రిమైసిన్ 0.4 గ్రా + కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.