బోధన్ ప్రతినిధి,అక్టోబర్ 18: (ప్రజా గళం)
బోధన్ మండలం ఆమ్దాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరం పై బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేంద ర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించా రు.ఈ దాడిలో నలుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి తెలిపారు. వారి వద్దనుండి 6,180./- రూపాయలు నగదు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు అయన చెప్పారు., అలాగే బోధన్ మండలం చిన్నమావంది గ్రామ శివారు లో పేకాట ఆడుతున్న స్థావరం పై దాడులు జరిపినట్లు ఆయన చెప్పారు.నలుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.5,000./- నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

