హoతకుడు రియాజ్ ఎన్ కౌంటర్. కానిస్టేబుల్ గన్ లాక్కొని, ట్రింగర్ నొక్కే ప్రయత్నం– ఆర్ ఐ జరిపిన కాల్పుల్లో హతం రియాజ్ ఎన్ కౌంటర్ పై సీ పీ సాయి చైతన్య వివరణ.

 

నిజామాబాద్ క్రైమ్ అక్టోబర్ 20, ( ప్రజా గళం )

 

కానిస్టేబుల్ ను దారుణంగా పొడిచి చంపిన పాత నేరస్తుడు రియాజ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందినట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఆవరణలోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సారంగాపూర్ ప్రాంతంలో అరెస్టు సందర్భంగా గాయపడిన రియాజ్ కు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆసుపత్రిలోని నాల్గవ అంతస్తులో రియాజ్ బందోబస్తు నిర్వహిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని ట్రింగర్ నొక్కే ప్రయత్నం చేశాడన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆప్రమత్తమైన ( ఆర్ ఐ )రియాజ్ పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఎన్కౌంటర్ పై దర్యాప్తు కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా రియాజ్ మృతితో ప్రభుత్వ ఆసుపత్రి బయట పోలీసులు, ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నిజమైన నరకాసుర సంవరణ జరిగిందని ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు. రియాజ్ ఎన్కౌంటర్ తో కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరిందని పలువురు పేర్కొన్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యులు రియాజ్ మరణం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నరహంతకుడికి సరైన శిక్ష పడిందని ప్రమోద్ కుటుంబ సభ్యులు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.