పలువురు బిజెపి నేతలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రాంచందర్

 

 

ఎడపల్లి,అక్టోబర్ 20: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రాంచందర్(అన్నా సేట్)ఇందూర్ శాసనసభ సభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తను నిజామాబాద్ లో కలిసి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు.అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,ఇందూరు జిల్లా ఎన్నికల కమిటీ కన్వీనర్ వడ్డీ మోహన్ రెడ్డిలను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్య క్షులు కందగట్ల రామచందర్ మాట్లాడుతూ దీపావళిని సంతోషంగా,ఆనందోత్సాహల మధ్య జరుపుకోవాలని జిల్లా మరియు మండల ప్రజలను ఆయన కోరారు. ఇందుర్ జిల్లా హిందూ బంధువులందరికీ కందగట్ల రాంచందర్(అన్నా సేట్)దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాయిని లక్ష్మణ్ గౌడ్,శివ చైతన్య,రఘు,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.