బోధన్ ప్రతినిధి,ఫిబ్రవరి 7: (ప్రజా గళం)
ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, పట్టణ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి,సమస్యలు పరి ష్కరించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ను గుర్తుంచు కొని బిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో అభ్యర్థి ప్రభావతిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సతీమణి,ట్రస్ట్ చైర్మన్,బీఆర్ఎస్ నాయకురాలు అయేషా ఫాతిమా ఆమేర్ ఓటర్లను కోరారు.23 వ వార్డులో అభ్యర్థి ప్రభావతితో కలిసి శనివారం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అభ్యర్థి ప్రభావతి మాట్లాడుతూ..రాజకీయ నాయకురాలిగా కాకుండా సామాజిక కార్యకర్తగా ప్రజల సమస్యలు పరిష్కరించ డానికి పని చేస్తానని ప్రభావతి హామీ ఇచ్చారు.ప్రభు త్వ పాఠశాలలు,విద్యార్థులకు చేసిన సహాయ సహకా రలను వివరించారు.బిఆర్ఎస్ హయంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసినట్లు ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో వార్డులోని ప్రజలు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

