బాన్సువాడ, ప్రజాగళం.
బాన్సువాడ వాసవి హై స్కూల్ విద్యార్థిని యండమూరి తపస్విని తన ప్రతిభతో మరోసారి వాసవి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. యువతపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై ఆంగ్లంలో చేసిన ఉపన్యాసం తో శ్రోతలను ఆకట్టుకొని ద్వితీయ బహుమతి సాధిం చింది.ఇటీవల ఒక దినపత్రిక ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలో నిర్వ హించిన ఉపన్యాస పోటీల్లో తపస్విని విశేష ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచింది.అనం తరం శనివారం నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో జరిగిన ఫైనల్ స్థాయి పోటీల్లో కూడా తన ప్రతిభను చాటుకొని ద్వితీయ బహుమతిని దక్కించు కుంది. “యువతపై సోషల్ మీడియా ప్రభావం – అవకాశాలా? ప్రమాదాలా?” అనే కోణంలో ఆమె ప్రసంగం సాగింది. సోషల్ మీడియా ద్వారా యువతకు లభిస్తున్న విద్యా అవకాశాలు, సమా చార వేగం, సృజనాత్మకత పెరుగుదల వంటి సానుకూల అంశాలతో పాటు, సమయ వృథా, మానసిక ఒత్తిడి, వ్యసనాల్లా మారుతున్న పరిస్థి తులను స్పష్టమైన ఉదాహరణలతో వివరిం చింది.ఆంగ్లంలో ఆత్మవిశ్వా సంతో, స్పష్టమైన ఉచ్చారణ తో, భావప్రధానంగా మాట్లాడిన తపస్వి నినిన్యాయనిర్ణేతలు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె ప్రసంగం యువతలో అవగాహన పెంపొందించే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు.తపస్వినికి లభించిన ఈ విజయంపై వాసవి హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యా యులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తు లో ఆమె మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

