నిజామాబాద్, ఏప్రిల్ 29 ( ప్రజాగళం ప్రతినిధి) :
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పరీక్షల్లో నలంద పాఠశాల విద్యార్థుల ప్రభంజనం . పదో తరగతి పరీక్షల్లో 100% అత్యుత్తమ ఫలితాలు సాధించు నాఘనత నలందకే దక్కింది. 600 మార్కులకు గాను 500 పైబడి సిహెచ్ సహస్ర 552,సిహెచ్ కీర్తి రెడ్డి 539రాహుల్536 వేద వ్యాస్ 536 మధుశ్రీ 536బాలాజీ533 రిషవర్ధన్ 530 మార్కులు సాధించారు. పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం నలంద ప్రసాద్, సాగర్ లు ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘనంగా సన్మానించారు .పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ ,ఉపాధ్యాయుల విద్యా బోధన తోనే అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశ భావం వ్యక్తం చేశారు

