పది ఫలితాలలో మళ్లీ బాలికలదేపై చేయి. రాష్ట్రస్థాయిలో 27 వ స్థానంలో నిజామాబాద్ జిల్లా.

 

నిజామాబాద్ ఏప్రిల్ 29 (ప్రజా గళం ప్రతినిధి)

 

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మళ్లీ బాలికలదే పైచేయిగా నిలిచింది. పదవ తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు కె. కేశవరావు బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. రాష్ట్రస్థాయిలో వెలువడిన ఫలితాలలో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిల్వగా, హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా 94.24 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 27వ స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 25365 విద్యార్థులు పరీక్షలు రాయగా, 22961 విద్యార్థులు పాసయ్యారు. వీరిలో 95.48 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా,93.01 శాతం బాలురు

ఉత్తీర్ణత సాధించారు. రీ కౌంటింగ్ కోసం ఫలితాలు వెలువడిన 15 రోజులలో తగిన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఫీజును మే 14, 15, 16 తేదీలలో చెల్లించాలని డి ఇ వో సూచించారు.

Leave A Reply

Your email address will not be published.