టీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆఏటి పురుషోత్తం.

 

ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:

తెలంగాణ ఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఆఏటి పురుషోత్తం ఎన్నికైన సందర్భంగా బిసి టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు పాల్గొని పురుషోత్తంకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా బిసిటియు జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ మాట్లాడుతూ.. పురుషోత్తం సేవలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఎన్జీవోస్

జిల్లా శాఖ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కంచరి రవికుమార్, వేణు, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.