భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమ త్తంగా ఉండాలి…బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి కోరారు….అత్యవసర సమయం లో ప్రజలకు అందుబాటులో ఉండండి….. మేడపాటి

 

 

బోధన్ ప్రతినిధి,జూలై 30: (ప్రజా గళం)

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బోధన్ నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి నియో జకవర్గ ప్రజలకు సూచించారు.ఈమేరకు అయన గురు వారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.వాగులు, వంకలు,చెరువులు,వరద నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. చిన్నారులు,వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవా లని,అలాగే బోధన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల లో అలాగే బోధన్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి,అవసరమై న సహాయ సహకారాలు అందించాలని మేడపాటి ప్రకాష్ రెడ్డి కోరారు.ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించి,ప్రజలకు సేవ చేయడంలో ముందుండా లి అని కార్యకర్తలకు మేడపాటి ప్రకాష్ రెడ్డి పిలుపుని చ్చారు.ప్రజల భద్రతే మన ప్రథమ ప్రాధాన్యం అని,ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండి, సురక్షితంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

Leave A Reply

Your email address will not be published.