హైదరాబాద్,జూలై 30,ప్రజాగళం:
ఆర్టీసీ బస్సులో ఎక్కిన వాళ్లు తాము దిగాల్సిన స్టేజీకి చేరుకున్నాక ఆటో బుక్ చేసుకుంటే సరిపోతుంది.. కానీ ఆ ఆటోలను కూడా ప్రభుత్వమే నడిపే ప్రయత్నం చేస్తోంది. ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది.. వాళ్లు కనీసం ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి తోడు ఈవీ ఆటోల పేరుతో భారీగా ఆటోలను తెచ్చి ప్రభుత్వమే వాటిని నడిపి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడుతోంది. వన్ స్టేట్, వన్ పర్మిట్ విధానం తీసుకువస్తామని హామీ ఇచ్చి విషయం మాట్లాడటం లేదు.. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇస్తామని మాట తప్పారు. ఉల్లంఘనల పేరుతో అటోలపై చలాన్ల మీద చలాన్లు వేస్తూ వాళ్లకు అదనపు భారం మోపుతున్నారు.ఇప్పుడున్న ఆటో డ్రైవర్లతోనే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఆటోలు నడిపించాలి. దీనిపై ఆటో యూనియన్లతో ప్రభుత్వం చర్చించాలి.. వారికి మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలి.లేదంటే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదు.. ఆటో డ్రైవర్లతో కలిసి ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తాం. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లోనూ ఈవీ ఆటోలు తెస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం చెప్తున్న లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈవీ ఆటోలను అసలు రోడ్డు మీదికే రానివ్వం.. మూడు రంగులు వేసిన ఈవీ ఆటోలతో ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడతామంటే ఊరుకోం. చెత్త కలెక్ట్ చేసే ఈవీ ఆటో డ్రైవర్లు 30 వేల మంది ఉన్నారు.. వాళ్లను కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో ఉన్న అందరూ ఆటో డ్రైవర్లకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలి.. లేదంటే ఆటో డ్రైవర్లతో కలిసి ఉద్యమిస్తాం

