బోధన్ శ్రీ చక్రేశ్వర శివాలయంలో హుండీ లెక్కింపు…. రూ.1.39 లక్షల ఆదాయం….ఎండోమెంట్ ఇన్స్ స్పెక్టర్ సుజాత రెడ్డి,ఈవో.నాయకం రాములు వెల్లడి…

 

బోధన్ ప్రతినిధి,జూలై 30: (ప్రజా గళం)

బోధన్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చక్రేశ్వర శి వాలయంలో గురువారం హుండీల లెక్కింపు కార్య క్రమాన్ని ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ సుజాతా రెడ్డి పర్యవే క్షణలో నిర్వహించారు.ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యు లు,వాసవి క్లబ్ సభ్యులు,ఆలయ అధికారులు,అర్చకు లు,భక్తుల సమక్షంలో హుండీలను తెరిచి నగదు లెక్కిం పు చేపట్టారు.హుండీల లెక్కింపులో మొత్తం రూ.1,39, 192 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో.నాయకం రాములు, అభివృద్ధి కమిటీ సభ్యులు లక్ష్మణ్ పటేల్,ఏ.శంకర్,ఇ. మౌనిక పోశెట్టి,గంగాధర్, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మ,మహారాజ్,మహేష్ పాఠక్,ఆలయ సిబ్బంది సుధాకర్,వాసవి క్లబ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.