బోధన్ ప్రతినిధి,జూలై 30: (ప్రజా గళం)
బోధన్ సీనియర్ ఫోటో అలాగే వీడియో గ్రాఫర్స్ అసో షేషన్ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహిం చారు.ఈ సమావేశంలో స్టూడియో యజమానులు పెరిగిన ధరలకు అనుగుణంగా పాస్(పిపి)ఫొటో సైజ్ ఫొటో రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు.స్టూడియో పీపీ సైజ్( పెరిగిన పేపర్ అట్లాగే కలర్ ధరలను దృష్టిలో ఉంచుకొని)రేట్లను పెంచుతున్నట్లు స్టూడియో యజ మానులు తెలిపారు.పెంచిన రేట్ల వివరాలు వారు వివ రించారు.పాస్ పోర్ట్ సైజ్ ఫోటో(8)కాఫీలకు 100 రూపా యలుగా,అలాగే (16)కాఫీలకి 150 రూపాయలుగా, అదేవిధముగా మొబైల్ ఫొటోస్ కి 50 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అని చెప్పారు.తమ నిర్ణయా న్ని గౌరవిస్తూ కస్టమర్లు కూడా సహకరించాలని ఫొటో స్టూడియో షాప్ యజమానులు కోరారు.ఈ సమావేశం లో ఫొటో స్టూడియో,వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్
అధ్యక్షులు మురళి కటికల,గౌరవ అధ్యక్షులు అనీల్ గౌడ్,ఉపాధ్యక్షులు శంకుగణేష్,సెక్రెటరీ సోముల అనిల్ రెడ్డి,జాయింట్ సెక్రెటరీ ఎర్ర శ్రీకాంత్,క్యాషియర్,ఉమా కాంత్,మాధవ్,అశోక్,పాండు,ప్రభాకర్.తదితరులు పాల్గొన్నారు.

