ఆర్మూర్ ఆగస్టు 1( ప్రజాగళం)
ఆర్మూర్ పట్టణం విద్యానగర్ లోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు ఆహుతూలను అలరించాయి. పాఠశాలలో విద్యార్థులు అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను ప్రదర్శించినప్పుడే ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను ఆపసించాలన్నారు. విద్యతోపాటు క్రీడల్లోను రాణించాలన్నారు. ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులు అత్యున్నత స్థానాలకు ఎదిగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ అంశాలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలోఅల్ఫోర్స్ పాఠశాల ప్రదానోపాద్యాయులు నర్సింహారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సోనీ, శంకర్, నవీన్, శివాని, నవత ,ప్రియాంక విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

