ఎడపల్లి,ఆగస్టు 8: (ప్రజా గళం)
రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని,ప్రతి గ్రామ సర్పంచ్ కు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేస్తామని బిజెపి పార్టీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి,బోధన్ అసెంబ్లీ ఇన్చార్జ్ వడ్డీ మోహన్ రెడ్డిలు అన్నారు.ఎడపల్లి మండ ల కేంద్రంలోని నయాబాది లోగల మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మాణానికి మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డిలు స్థానిక సర్పంచ్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రాంచందర్ తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..నిజామాబాద్ పార్లమెంట్ సభ్యు లు ధర్మపురి అరవింద్ బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కి కేటాయించిన 70 లక్షల నిధుల నుండి ఎడపల్లి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద షెడ్డు నిర్మాణా నికి 4.5 లక్షల నిధులు కేటాయించడం జరిగింది అని అన్నారు.ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం రూ.16లక్షలు కేటాయించినట్లు వారు చెప్పారు.ప్రస్తుతం బీజేపీ సర్పంచులు ఉన్న గ్రామాల్లో పనులకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ,ఇకమీ దట పార్టీలకతీతంగా బోధన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులకు ఎంపీ నిధులు అందిస్తామని వారు హామీ ఇచ్చారు.ఇటీవల నిర్వహించిన వరుణ యాగం ఫలితంగానే వర్షాలు కురుస్తున్నాయని,ఇది రైతులకు ఎంతో మేలు చేసిందని వారు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నిజాంసాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరందించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు.రైతాంగానికి నిరంతరంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్,మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్,బ్రాహ్మణపల్లి సర్పంచ్ పురమల్ల హనుమంతు,సోషల్ మీడియా జిల్లా ఇంచా ర్జి,వడ్డెపల్లి మాజీ సర్పంచ్ కూరెళ్ల శ్రీధర్,జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లెపూల శ్రీనివాస్,నాయకులు కరుణం శంకర్ రావు,కటకం సుధాకర్,మోస్రా సాయి కుమార్, బట్టు రాజు,కటకం శంకర్,వార్డు సభ్యుడు శంకర్,గ్రామ పెద్దలు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

