నిజామాబాద్ వైద్య విభాగం ఆగస్టు 13( ప్రజాగళం)
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, జీవనశైలి వ్యాధులు , క్షయ వ్యాధి,వ్యాధి నిరోధక టీకాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి. రాజశ్రీ గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాల పరిశుభ్రత, నీటి ట్యాంకులను వారానికోసారి తప్పకుండా శుభ్రం చేస్తూ ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ కలిసిన క్లోరినేషన్ వాటర్ ని తాగాలని, నీటి నిల్వలను తొలగించాలని, కాలి ప్లాట్లు, మురికినీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ ను వదలాలని, డెంగీ వ్యాధి వచ్చిన ఇంటి చుట్టూ 50 ఇళ్లలో పైరత్నం స్ప్రే చేయాలని, 100 ఇళ్ల వరకు టెమిపాస్ స్ప్రే చేయాలనీ,

ఇంటింటికి జర సర్వేను నిర్వహించి, ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ప్రతిరోజు రక్త పరీక్షలను నిర్వహించాలన్నారు. యాంటీ లార్వల్ స్ప్రేను, ఫాగింగ్ ను నిర్వహించాలన్నారు. డెంగీ సోకిన వారి దగ్గర అసలు ద్రవ ఆహారాలను తరచుగా తీసుకోవాలని, పారాసెటమాల్ మాత్రలు వేసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలన్నారు, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని, సీజనల్ వ్యాధులపై ప్రజల్లో పాఠశాలలో, కళాశాలలో విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. నీటి కాలుష్యం వల్ల వ్యాపించే వ్యాధులను నీటి పరీక్ష కిట్లను ఉపయోగించి నీటి నాణ్యతను పరీక్షించాలన్నారు. తద్వారా టైపాయిలు డయేరియా అతిసారా కలరా వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పడాలన్నారు, క్షయ వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించే క్షయ నిర్ధారణ పరీక్షలను ప్రజలు వినియోగించుకోనేలా చూడాలని, క్షయ వ్యాధిగ్రస్తులు 6 నెలల చికిత్స కోర్సును వాడాలన్నారు, జీవనశైలి వ్యాధుల్లో భాగంగా 30 సంవత్సరాల పైబడిన వారిని హైపర్ టెన్షన్ మధుమేహం క్యాన్సర్ కోసం నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి అన్నారు, పరీక్షల కోసం పెండింగ్లో ఉన్న వారందరినీ పరీక్షించి ఎమ్మా లాగిన్ లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికే చికిత్స తీసుకుంటున్న వారందరినీ లైన్ లిస్టు ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులను టీకాలు తీసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు అన్నారు. అనుమానిత కేసులైన ఏ ఎఫ్ పి, మీజిల్స్ షాంపూల్స్ ను సేకరించి పంపించాలన్నారు, ఈ సమీక్ష సమావేశంలో డిటిసి ఓ డాక్టర్ దేవి నాగేశ్వరి, పి ఓ డి టి డాక్టర్ అంజన, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య, డిస్టిక్ ఫార్మసీ సూపర్వైజర్ నారాయణ, హెచ్ఈఈవో జహీద్ ఆఫీస్, డిప్యూటీ డెమో దుర్గారావు, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు వివిధ పీహెచ్సీల సిహెచ్ ఓలు, హెచ్ ఈ లు, హెచ్ ఇ ఓ లు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

