కామారెడ్డి, ఆగష్టు 15( ప్రజాగళం )
కామారెడ్డి జిల్లాలోని దేవుని పల్లి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.బ్యాంక్ మేనేజర్ కొట్టూరు ప్రశాంత్ జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోపరేటివ్ బ్యాంకుల వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని, రైతులతోపాటు ఇతర రంగాల్లో ఉన్న వారికి కూడా , కోపరేటివ్ బ్యాంకుల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ పథకాలు అమలుకు కోపరేటివ్ బ్యాంకు ఎప్పుడు ముందుంటుందని, మేనేజర్ కొట్టూరు ప్రశాంత్ పేర్కొన్నారు..ఇతర వాణిజ్య బ్యాంక్ ల కన్నా తక్కువ వడ్డీ తొ కర్షక మిత్ర. గోల్డ్ లోన్ సదుపాయం. అధిక వడ్డీతొ కూడిన డిపాజిట్ సౌకర్యం కలదన్నారు.తమ బ్రాంచ్ లో లాకర్ సదుపాయం ఉన్నదన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది మౌనిక. శ్రీహరి, స్వప్న, ఖాతదారులు , విశ్రాంత ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

