నిజామాబాద్ సిటీ ఆగస్టు 15 (ప్రజాగళం)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీలో గల సాయినాథ్ టవర్స్ అపార్ట్మెంట్ లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అపార్ట్మెంట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు కే. వి.రఘు మాట్లాడుతూ, ఎందరో త్యాగ ధనుల పోరాట ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశభక్తి పెంపొందే విధంగా వందేమాతరం గీతాన్ని ఆలపించడం జరిగిందన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పంచుకొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు.ఈ పంద్రాగస్టు వేడుకల్లో అపార్ట్మెంట్ ప్రతినిధులు పెంటూ మోహన్, ప్రశాంత్, రమణ, జనార్ధన్, సత్యనారాయణ, రమేష్, రవి, శారద, రోజా, ఆశారాణి తదితరులు పాల్గొన్నారు.

