నిజామాబాద్ సిటీ , ఆగష్టు 15( ప్రజాగళం )
వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ తెలంగాణ అమరవీరుల పార్కులో మొదటిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అమరవీరుల పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ స్రవంతి రెడ్డి జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, డివిజన్ ప్రజలందరికీ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీనియర్ సిటిజన్ సభ్యులకు శాలువాతో సత్కరించారు. జైహింద్, భారత్ మాతాకీ జై అంటూ ఘనంగా నినాదాలు చేశారు.స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులను ఈ సందర్బంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు ఆయుష్ పురుషోత్తం, వినోద్ కుమార్, కొట్టూరు రమేష్, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, రామరాజు,సిద్ధిరాములు, సాయ గౌడ్, శ్రీనివాస్,సంపత్,
తదితరులు పాల్గొన్నారు.

