విద్యార్థులే దేశ భవిష్యత్తు, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తితో ముందుకు సాగాలి ఎన్ సీ సీ జనరల్ కల్నల్ ప్రేమ్ జిత్ నిర్మల హృదయ హై స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ,ఆగస్టు 15: (ప్రజా గళం)

 

విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తితో ముందుకు సాగాలని ఎన్ సీ సీ జనరల్ కల్నల్ ప్రేమ్ జిత్ స్పష్టం చేశారు. శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

నిర్మల హృదయ హై స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, క్రమశిక్షణ, ఉత్సాహం వైభవంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్ సీ సీ జనరల్ కల్నల్ ప్రేమ్ జిత్ అధికారి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవ డా: యూ . నిర్మల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలురెవ సిస్టర్ సరిత సింగారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ రెవ సిస్టర్ ఇన్నాలు, తెలుగు మీడియం ఇన్‌చార్జ్ రెవ సిస్టర్ సుందరి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ శుభాకాంక్షలు అందించారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎన్ సీ సీ జనరల్ కల్నల్ ప్రేమ్ జిత్ అధికారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు.జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థినిలు చేసిన మార్చ్‌పాస్ట్

చూపరులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వివిధ హౌస్‌లకు చెందిన విద్యార్థులు పూర్తి క్రమశిక్షణతో, సమన్వయంతో, ఉత్సాహంతో మరియు దేశభక్తి భావంతో మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. విద్యార్థుల అడుగుల్లోని సమన్వయం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు దేశభక్తి భావం అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథి మార్చ్‌పాస్ట్‌ను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కల్నల్ ప్రేమ్ జిత్ మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి, నైతిక విలువలు మరియు సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ ప్రతిభను దేశ ప్రగతికి వినియోగించాలని సూచించారు.పాఠశాల సుపీరియర్ తన సందేశంలో స్వాతంత్ర్యం మనకు అందించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తుచేస్తూ, విద్యార్థులు ప్రేమ, ఐక్యత, సేవాభావం మరియు మంచి పౌరసత్వాన్ని జీవితంలో ఆచరించాలని ప్రేరేపించారు. సమాజానికి సేవ చేయడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు నిజమైన గౌరవం ఇవ్వాలని సూచించారు.అనంతరం

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవ సిస్టర్ సరిత సింగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్సిసి ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని సమగ్ర వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. “మన దేశం మన గర్వం – మన బాధ్యత మన భవిష్యత్తు” అనే స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి, భారతీయ సంస్కృతి , జాతీయ ఐక్యతను అద్భుతంగా ప్రతిబింబించాయి. విద్యార్థుల దేశభక్తి గీతాలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులు, అతిథులు మరియు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మార్చ్ ఫాస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక శోభను తీసుకువచ్చాయి. విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శనలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు మరియు సందర్శకులు హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఆస్వాదించారు. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సమష్టి కృషి, అంకితభావం మరియు సమన్వయంతో ఈ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవంతంగా, చిరస్మరణీయంగా ముగిశాయి.

Leave A Reply

Your email address will not be published.