నిజామాబాద్ సిటీ ఆగస్టు 16
( ప్రజాగళం )
ఇప్పటివరకు అద్దె భవనంలో కొనసాగిన సాయి ఆయుష్ పిల్లల ఆస్పత్రి ఆదివారం సొంత భవనంలో తమ సేవలు ప్రారంభించామని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు సంకీర్త్ రావు, డాక్టర్ స్ఫూర్తి తెలిపారు. హైదరాబాద్ తరహాలో చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేందుకు ఆధునిక పరికరాలను సాయి ఆయుష్ పిల్లల ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందని వారు వెల్లడించారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ద్వారక నగర్ లో గల సాయి ఆయుష్ ఆసుపత్రి సమీపంలోని ప్రగతి ఆసుపత్రి ప్రక్కన నూతనంగా నిర్మించిన భవనంలోనికి మార్చడం జరిగిందని వారు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ భవనంలోనే ప్రస్తుతం సేవలు అందించబడతాయని హైదరాబాద్ కు దీటుగా ఆధునిక పరికరాలతో పిల్లలకు చికిత్సలు అందించే సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు. అనుభవం కలిగిన సిబ్బంది ఉన్నారని, చిన్న పిల్లలకు సంబంధించిన క్రిటికల్ సమస్యలతో పాటు అత్యవసర సేవలు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఇకనుండి హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు సంకీర్త్ రావు తెలిపారు.గతంలో మాదిరిగానే ఓపి,ఐపి సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పూజా కార్యక్రమంలో ఆస్పత్రి యజమాన్యం సాగర్, శ్రీపాదరావుల తో పాటు ప్రముఖ వైద్యులు నీలం రామచందర్, జక్క రవి, దీపక్ రాథోడ్, సత్య కుమార్ స్వామి, ఇందిరా, మీనాక్షి, రామకృష్ణ ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

