ఎడపల్లి,ఆగస్టు 20: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రం శివారులో ని సాటాపూర్ గేట్ వద్ద గురువారం బోధన్ – నిజామా బాద్ ప్రదాన రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో రైతులు,నాయకులు,కార్యకర్తలు రాస్తారోకో నిర్వహిం చారు.సుమారు 20 నిమిషాల పాటు నిర్వహించిన రాస్తారోకో వల్ల బోధన్ – నిజామాబాద్ వైపు వెళ్ళు వాహనాల రాకపోకలు నిలిచి పోవడంతో ట్రాఫిక్ స్థంభించి పోయింది.రాస్తారోకో నిర్వహిస్తున్న స్థలానికి ఎస్ఐ రేణుక,పోలీస్ సిబ్బంది చేరుకొని రాస్తా రోకోను విరామింప చేశారు.అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.ఈ సందర్బంగా మాజీ ఎంపిపి కొండెం గల శ్రీనివాస్,మండల పార్టీ నాయకులు దుబ్బాక రవీందర్ గౌడ్,ఆకుల శ్రీనివాస్ లు విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు ఎరువుల విక్రయం కోసం ప్రవేశ పెట్టిన యూరియా యాప్ తో గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,స్మార్ట్ పోన్ లేక కొందరు,యాప్ తెలియక అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కష్టపడి యాప్ ద్వారా ఎరువులు బుకింగ్ చేసుకున్న రైతులకు సహకా ర సంఘాల ద్వారా ఎరువులు ఇవ్వకుండా,వారికి ఎరువులతో పాటు ఇతర మందులు కొంటేనే ఎరువులు ఇస్తామంటూ మెలిక పెట్టి రైతులను ఆర్ధికంగా నష్టపరు స్తున్నారని ఆరోపించారు.ఈ విషయం వ్యవసాయశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని అన్నారు.రైతులకు యాప్ ద్వారా ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తులు తీసుకోవాలని లింక్ పెడుతున్న సహకార సంఘాల పనితీరును నిరసిస్తూ,రాస్తారోకో నిర్వహించారు.తక్షణమే ఎరువుల బుకింగ్ యాప్ ను రద్దు చేయాలని,ఎరువుల కొంటే ఇతర మందులు కూడా కొనాలని మెలిక పెడుతున్న సహకార సంఘా లపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గైని పోచయ్య, బిఆర్ఎస్ నాయకులు నాగేందర్ రెడ్డి,రాజిరెడ్డి,గడ్డం శ్రీనివాస్,ఆకుల సురేష్.మహెందర్ రెడ్డి,మల్క స్వామి, ఎంబ రాజేశ్వర్,మల్కన్న,యాదగిరి గౌడ్,సురేష్ గౌడ్, అరుగుల నాగరాజు,మదుగౌడ్,కిష్టపురం రవి,మియా జానీ,యూసుఫ్,షేక్.జావీద్(బాబా),దశరథ్, పాషా ఖాన్,రవిగౌడ్,స్వామి,అల్తాఫ్,జీవన్ రెడ్డి,అల్తాఫ్, లాయక్ అలీ,ముస్తాక్,హస్సేన్,బర్దిపూర్ ప్రవీణ్, అంబం అబ్బయ్య,గిర్ని గంగప్రసాద్,పలువురు పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

