*సీనియర్ నటీ షావుకారు జానకి మృతి పట్ల సంతాపం* -ఘనంగా నివాళులు అర్పించిన శ్రీ గౌతమ కళా సమితి

నిజామాబాద్, ఆగష్టు 22(ప్రజాగళం)

 

కళైమామని,పద్మశ్రీ షావుకారు జానకి మృతి పట్ల నిజామాబాద్ శ్రీ గౌతమ కళా సమితి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.ఇందూరు సీనియర్ నటులు, దర్శకులు శ్రీపాద కుమార శర్మ అధ్యక్షతన సమావేశమైయ్యారు. జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్ కళా వేదిక లో శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్బంగా కళా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగు సినీ రంగానికి తనకంటు ఓ ప్రత్యేక నటనతో హీరోయిన్ గా,ప్రముఖ నటులు ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్., ఎంజి.ఆర్., శివాజీ గణేషన్ లతో నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో క్యారక్టర్ నటిగా రాణించి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారన్నారు. అనర్గలమైన వాక్ చాతుర్యంతో వ్యాఖ్యతగా కూడా పేరుపొంది, ఏడు పదుల సినీ జీవితంలో మచ్చలేని నటిగా గుర్తింపు పొందరన్నారు.ఈ కార్యక్రమంలో

శ్రీ గౌతమ కళాసమితి సభ్యులు, నటులు పి. రాములు, సుభాష్ రెడ్డి, వి.పి. చందన్ రావు కార్యదర్శి ఎన్. రఘు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.