నిధులు అవకతవకలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలి పెట్టేది లేదు….రికవరీ చేసి తీరుతాం…. ఎడపల్లి సొసైటీ ఛైర్మెన్ పోల మల్కారెడ్డి స్పష్టం….

 

 

ఎడపల్లి,ఆగస్టు 24: (ప్రజా గళం)

గత వారం నుండి ఎడపల్లి సొసైటీలో ఏదైతే సేల్స్ మెన్లు నిధులు అవకతవకలకుపాల్పడ్డారాని,గోల్ మా ల్ చేసిండ్రని పలు పత్రికల్లో ఆరోపణలను వాస్తవాలని వార్తలు రావడం జరుగుతోంది అని,దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పోల మల్కారెడ్డి తెలిపారు.ఎడపల్లి గ్రామంలోని తన సహకార సంఘ కార్యాలయ ఛాంబర్ లో సోమవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మల్కారెడ్డి మాట్లాడుతూ..ఆ పైసలనేది సొసైటీ కి పది రూపాయలు రావాలని,ఒక రూపాయి కూడా నష్టపో కూడదని,పాలకవర్గం సభ్యులు అందరం కష్టపడి అభి వృద్ధి వైపు తీసుకెళ్లడం జరుగుతుంది అని అయన తెలిపారు.అలాగే సొసైటీలో ఎంటలేక్స్ కు ఏదైతే ఉన్న దో,ఆన్ లైన్ కు ఏదైతే ఉన్నదో దానిప్రకారమే చేయడం జరిగింది అని చైర్మన్ మల్కారెడ్డి తెలిపారు. సొసైటీలో నిధులు గోల్ మాల్ అనేది ఆరోపణలకు అనుగుణంగా జిల్లా సహకార కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారి(డిసివో) నిధుల అవకతవాకాలపై ప్రత్యేక విచారణ అధికారిని నియమించడం జరిగింది అని అయన తెలిపారు. అధికారుల విచారణ ద్వారా సొసైటీకి ఏది తేలిన సొసై టీ కార్యదర్శి గానీ,సేల్స్ మెన్లు కానీ,ఎవ్వరి పద్దులు ఉన్నా వదిలిపెట్టేది లేదని,నిధులు అవకతవకలకు పాల్పడిన వారి వద్ద నుండి కచ్చితంగా రికవరీ చేపడ తామని సొసైటీ ఛైర్మెన్ పోల మల్కారెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.