ఎడపల్లి,ఆగస్టు 24: (ప్రజా గళం)
ఎడపల్లి మండల కేంద్రంలో ని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై మేతకు వెళుతున్న బర్రెను సోమవా రం ఉదయం గుర్తు తెలియని వాహనం”ఢీ”కొంది అని ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపారు.ఎస్ఐ తెలి పిన వివరాల ప్రకారం.. ఎడపల్లి గ్రామానికి చెందిన కంటేడి సంతోష్ పశు పోషకుడు చెందిన బర్రెలను ఈరోజు తీసుకెళుతుండగా నిజామాబాద్ నుండి బోధన్ వైపు అతి వేగంగా వెళుతున్న గుర్తుతెలియని మినీ వ్యాన్ ఢీకొంది.ఈ ఘటనలో బర్రెకు తీవ్ర గాయా లై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆమె తెలిపారు. మృతి చెందిన బర్రె సుమారు 60 వేల రూపాయలు ఉంటుందని బాధితుడు కంటేడి సంతోష్ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమ తెలిపారు.

