ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు సద్విని యోగం చేసుకోవాలి….రుణాలు పొంది తిరిగి చెల్లించి నప్పుడే అభివృద్ధి….ఐకెపి మండల ఎపిఎం రాజేందర్ వెల్లడి…ఎడపల్లి ఐకెపి కార్యాలయంలో మండల మహి ళా సమాఖ్య ఆధ్వర్యంలో మహాజన సభ…మండల మహిళా సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నిక….నూత న కార్యవర్గం ప్రమాణ స్వీకారం…

 

ఎడపల్లి,ఆగస్టు 25: (ప్రజా గళం)

ఎడపల్లి మండలంలోని గ్రామాలలో స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ ఫలా లను సద్వినియోగం చేసుకోవాలని ఎడపల్లి మండల ఐకెపి ఎపిఎం.రాజేందర్ అన్నారు.ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మంగళవారంమండ ల మహాజన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల,జిల్లా సమైక్య అధ్యక్షురాలు హేమలత అధ్యక్ష తన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఐకెపిఎపిఎం రాజేందర్ మాట్లాడుతూ..ప్రతి ఒక సంవత్సరం మండ ల మహిళా సమైక్య కార్యవర్గాన్ని సభ్యులచే ఎన్నుకోవ డం జరుగుతుందన్నారు.దాంట్లో భాగంగా మండల మహిళా సమాఖ్య నూతన మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు అయన తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకు రుణాలతో పాటు,శ్రీనిధి,గ్రామ సంఘం ద్వారా రుణాలు పొందేందు కు అవకాశం ఉందన్నారు.డబ్బులు అవసరం ఉన్న మహిళలు మాత్రమే పైన పేర్కొన్న సంఘాల నుంచి రుణాల పొందాలన్నారు.తిరిగి క్రమంగా బ్యాంక్ లకు చెల్లించాలని ఆయన కోరారు.2025-26 సంవత్సరంకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు,జమకర్చులు వివ రాలను ఏపిఎం రాజేందర్ చదివి వినిపించారు.జిల్లా లలోని ఎడపల్లి మండల మహిళా సమైక్యతతో పాటు ఐకెపి ఆర్థికంగా లాభాలలో ఉందన్నారు.ప్రతి ఒక మహిళా సంఘానికి సుమారు లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా ఋణం రూపం లో ఇప్పించడం జరుగుతుందని అయన తెలిపారు. మహిళలు రుణాలను అవసరాన్ని బట్టి వాడుకోవాల న్నారు.2025 -26 కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ను వినిపించడం జరిగింది అని,అదేవిధంగా రాబోయే 2026 – 27 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం ఆమోదించడం జరిగిం ది అని అయన తెలిపారు.అలాగే కొత్త బైలా ప్రకారం ఈసీ మెంబర్స్ 15 మందిని ఎంపిక చేసుకొని వారికి కాలపరిమితి ఒకటి నుంచి మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తూ పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అని వివరించారు.ఎడపల్లి మండల మహిళా సమైక్య అధ్య క్షురాలుగా బి.హేమలత,(ఎడపల్లి),ఉపాధ్యక్షురాలుగా సంగీత (వడ్డేపల్లి),కార్యదర్శిగా మన్నేటి శ్రీదేవి(ఎంఎస్సి ఫా రం),సహాయ కార్యదర్శిగా బి.లక్ష్మి (జానకంపేట), కోశాధికారిగా సరోజినీ దేవి(ఠాణాకాలన్)లను ఎన్ను కున్నట్లు ఎపిఎం రాజేందర్ తెలిపారు.ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులతో ఐకెపి ఎపిఎం రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం వారిని అభినందించారు

ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం రాజేందర్,శ్రీనిధి జిల్లా రీజినల్ మేనేజర్ రాందాస్,శ్రీనిధి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గైని రాణి,కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ పాండు రంగం,భాస్కర్,వినోద్ కుమార్,రాజయ్య,మధు,గాండ్ల సాయిలు,రాము,శాంత కుమారి,నవీన,సవిత,సునీత, ఆయా గ్రామాల డ్వాక సంఘాల అధ్యక్షులు కార్యదర్శు లు,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.