బోధన్ ప్రతినిధి,ఆగస్టు 24: (ప్రజా గళం)
పవిత్ర శ్రావణమాసంలో భాగంగా బోధన్ మండలం కల్దుర్కీ,రాంపూర్,ఖండ్గావ్,సిద్దాపూర్ గ్రామాల నుంచి కొందరు భక్తులు లోక కళ్యాణం,అందరూ సుఖ సంతో షాలతో జీవించాలని,అష్టైశ్వర్యాలు పొందాలని,గ్రామా లు అభివృద్ధి పథంలో ఉండాలనే సంకల్పంతో నిజామా బాద్ మండలం మల్లారం గ్రామ పరిధిలోని శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంకు ఆదివారం పాదయాత్రగా బయలుదే రారు.ఈ సందర్భంగా ఎరాజ్ పల్లి గ్రామ కమాన్ వద్దకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులు చేరుకోగా గ్రామంలోని విజయలక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాన్యం భక్తులకు అల్పాహారం అందించారు.గ్రామస్తులు అల్పాహారం అందించిన దాతలను శాలువాలతో ఘనంగా సన్మానిం చారు.పాదయాత్ర చేస్తున్న భక్తులకు అల్పాహారం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని దాతలు బొందుగు ల శ్రీనివాస్ గుప్తా,నాగరాజు గుప్తా,వెంకటేషం గుప్తాలు సంతోషం వ్యక్తం చేశారు.ఇందుకు సహకరించిన గ్రామ స్తులకు దాతలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో శివ భక్తులు రాంజీ,రాజన్న,హంగర్గ రాజు,దిగంబరు గురూజీ,శివ,చందు,అశోక్,లక్ష్మణ్,జ్ఞానేశ్వర్,భజన మండలి మహిళలు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

