ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 22 వరకు బిఎల్ఓ లు గ్రామాలలో గ్రామ సభలు….నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు గ్రామ సభకు విచ్చేసి ఓటు హక్కు పొందా లి….లేదంటే ఓటు ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది… ఎడపల్లి మండల తహసీల్దార్ దత్తాద్రి వెల్లడి….

 

 

ఎడపల్లి,ఆగస్టు 25: (ప్రజా గళం)

ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా డ్రాప్ట్ లిస్టు ఆగస్టు 17 న ఎలక్షన్ కమిషన్ నుండి ముసాయిదా ఓటర్ లిస్టు వచ్చిందని,ఎస్ఐఆర్ సర్వే లో భాగంగా అంటే ఎన్యూమరేషన్ గణన స్టేజ్ తర్వాత డ్రాఫ్ట్ లిస్టు వచ్చిం ది అని ఎడపల్లి మండల తహసీల్దార్ దత్తాద్రి తెలిపా రు.ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగ ళవారం బిఎల్ఓ లతో ఎస్ఐఆర్ ప్రక్రియ పై అవగాహ న సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా తహసీ ల్దార్ మాట్లాడుతూ..ఓటర్ లిస్టులోని పేర్ల ఆధారంగా ఓటర్ల పేర్లు ఇతరతర చిన్న చిన్న పొరపాట్ల వల్ల వారికి నోటిస్ లు వచ్చాయాని అయన తెలిపారు.దాంట్లో మన ఎడపల్లి మండలానికి మొత్తం 6439 వివిధ పొర పాట్లకు నోటీసులు వచ్చాయాని అన్నారు.ఈ సందర్బం గా ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 22 వ తేదీ వరకు బిఎల్ఓ లు గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించ డం జరుగుతుంది అని తెలిపారు.ఎవరైతే ఓటర్లకు నోటిస్ లు వచ్చాయో ఆ ఓటర్ వద్దకు వెళ్ళి సర్వే చేయాలని బిఎల్ఓ లకు సూచించడం జరిగింది అని వెల్లడించారు.షెడ్యూల్ ప్రకారం నోటిస్ సంఖ్యను బట్టి ఒక్కొక్క గ్రామాలలో ఒక రోజు లేదా రెండు రోజులు షెడ్యూల్ రూపొందించుకోవడం జరుగుతుంది అని అన్నారు.గ్రామాలలో నిర్వహించే గ్రామ సభలకు తహ సీల్దార్ కూడా హాజరువుతారని చెప్పారు.ఈ నోటిస్ అందుకున్న ప్రతి ఒక్క ఓటరు కూడా దానికి సంబందిం చిన ఆధారం తీసుకురావాలని,వారి పేర్ల నమోదులో అక్షరాలు,తల్లీ,తండ్రి,కొడుకు ఓటరు,వయస్సులో తేడా లు,పోరాట్లకు సిస్టమ్ లో నోటిస్ లు డిలీట్ అవడం జరిగింది అని అన్నారు.కాబట్టి నోటిస్ అందుకున్న ప్రతి ఓటరు గ్రామంలో నిర్వహించే గ్రామ సభలకు సంబంధి త ఆధారాలతో హాజరై వాటిని బిఎల్ఓ లకు చూపెడితే ఓటర్ లిస్టులో పొరపాట్లను సరిదిద్ధి,వారికి ఓటుహక్కు కల్పిస్తామని తహసీల్దార్ దత్తాద్రి తెలిపారు.బిఎల్ఓ లు ఇచ్చే నోటిస్ ఎవరైతే తీసుకోరో,లేదా నోటిస్ తీసుకొని గ్రామ సభకు రారో వారి ఓటు హక్కు పోయే ప్రమాదం ఉందని అయన స్పష్టం చేశారు.ఈ సందర్బంగా ఎలక్షన్ కమిషన్ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఓటరు సద్వినియో గం చేసుకోవాలని,ఓటు హక్కు అనేది కచ్చితమైనదిగా భావించి మీ గ్రామంలో నిర్వహించే గ్రామ సభకు హాజ రు కావాలని అయన కోరారు.మండలంలో సగం తహ సీల్దార్ కు,సగం ఎంపిడివో కు పోలింగ్ స్టేషన్ లను విభజించడం జరిగింది అని,ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలమేరకు నిర్ణయించడం జరిగింది అని అయన తెలిపారు.మండలంలో మొత్తం 36 పోలింగ్ స్టేషన్ లకు గాను 18 పిఎస్ లు తహసీల్దార్ కు,18 పిఎస్ లు ఎంపిడివో లకు కేటాయించడం జరిగింది అని,కావున గ్రామాలలో నిర్వహించే ఆయా గ్రామ సభలలో పాల్గొని ఓటర్ల ఓటర్ లిస్టులో జరిగిన పొరపాట్లను క్షుణ్ణంగా పరిశీలించి,వాటిని సరిదిద్ధి,ఓటర్ కు ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది అని అయన చెప్పారు.ఈ సందర్బంగా నోటిస్ అందుకున్న ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరై ఓటర్ లిస్టులో లోపాలను సరిదిద్దుకోవాలని తహసీల్దార్ దత్తాద్రి ఓట ర్లను కోరారు.ఈ సమావేశంలో డిప్యుటీ తహసీల్దార్ అనూష,మండలంలోని 36 మంది బిఎల్ఓ లు హాజ రయ్యారు.

Leave A Reply

Your email address will not be published.