టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు….సాలూర చెకపోస్ట్ వద్ద 4 కేజీల గంజా యి పట్టివేత…..

 

 

బోధన్ ప్రతినిధి, ఆగస్టు 29: (ప్రజా గళం)

టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీసులు పట్టుకుని,అతని వద్ద నుంచి 4 కిలో ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం..టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై ఓ వ్యక్తి బోధన్ పట్టణానికి గంజాయి సరఫరా చేసేందుకు వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం అందింది.దీంతో రూరల్ సీఐ విజయ్ బాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి సాలూర చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో అను మానాస్పదంగా వస్తున్న మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకాకు చెందిన లక్ష్మణ్ గంగగిరి(65) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా 4 కేజీల గంజా యి లభించింది. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.