బోధన్ లో బీజేపీ నూతన మున్సిపల్ ఫ్లోర్ లీడర్లకు ఘన సన్మానం…..

 

 

బోధన్ ప్రతినిధి,ఆగస్టు 30 : (ప్రజా గళం)

భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యం లో నూతనంగా నియమితులైన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొలిపాక రేణుక బాలరాజు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజు లదేవి లక్ష్మీ పూజిత పవన్ కుమార్,ఫ్లోర్ సెక్రటరీలు గుంత అబ్బవ్వ,గంగాధర్ లను ఘనంగా సన్మానించా రు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారికి శాలువాలు కప్పి సత్కరించి,మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్ మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఫ్లోర్ లీడర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మున్సిపల్ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్,బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్,సీనియర్ నాయకులు హన్మండ్లు చారి,పప్పుల వేణు,పెరక వెంకటేష్, బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్,పార్టీ నాయకులు కలిగోట కృష్ణ,గడ్డం శ్రీనివాస్,వినయ్, చరణ్,కన్నె శ్రీనివాస్,హరి, అనీల్,రవి కుమార్,కస్ప లింగం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.